దత్తాత్రేయ స్వామి జన్మదినం అన్నమాట. ఈ స్వామి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, పరమేశ్వరుల కలయిక. హిందూ పండుగల్లో దత్త జయంతికి ప్రత్యేక స్థానం ఉంది. మార్గశిర పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు.
Dattatreya Jayanti 2021 Date and Tithi Time |
|
Date | December 18, 2021, Saturday |
Tithi | Margasira Sukla Pournami |
Tithi Time | Begins 07:24 AM Dec 18 2021 - Ends 10:05 AM Dec 19, 2021 |
దత్తాత్రేయ స్వామి... అత్రి ముని, అనసూయల కొడుకు. మహా పతివ్రత అయిన అనసూయ... తన బిడ్డకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులు రావాలని కోరుకుంది. అలాగే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. రామాయణం, మహాభారతంలో దత్తాత్రేయ ప్రస్తావన ఉంటుంది. అధర్వణ వేదంలో దత్తాత్రేయ ఉపనిషత్తు ఉంది. తన భక్తులకు ఆ స్వామి జ్ఞానోదయం కలిగిస్తారు.
దత్తాత్రేయ భక్తులు సహజంగా ఈ రోజు ఉపవాసం చేస్తారు. చాలా మంది ఇవాళ పుణ్య నదుల్లో స్నానం చేస్తారు. లేదంటే... దగ్గర్లోని చెరువులకు వెళ్తారు. ఆ తర్వాత పూజ చేస్తారు. దత్తాత్రేయ స్వామి ఫొటోను ఉంచి, చుట్టూ పూలతో డెకరేట్ చేస్తారు. దీపాలు వెలిగిస్తారు. కర్పూరంతో హారతి ఇస్తారు. భక్తులు ధ్యానం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, పవిత్ర గ్రంథాలైన అవధూత గీత, జీవన్ముక్త గీత వంటి దత్తాత్రేయ స్వామి గురించి తెలిపేవి చదువుతారు. భజనలు కూడా చేస్తారు.