Advertisment

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు  రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.

 నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. 

వారాహీ అమ్మవారు అంటే భూదేవి.హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు,శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి,వాడిని సంహరించి,భూదేవిని రక్షిస్తాడు.స్వామివారి  మీద భక్తి తో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది.అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ.అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది. 

వారాహీ అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది...ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం...ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే,ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది.నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది.ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత. 

ఆషాఢ నవరాత్రి ప్రతి రోజూ, సప్త మాత్రుక దేవతలను  మరియు అష్ట మాత్రుక దేవతలను  పూజించడం, ఎనిమిదో రోజు వరాహి దేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది.


ఆషాఢ నవరాత్రి 2024 తేదీలు

ఈ సంవత్సరం ఆషాఢ నవరాత్రులు July 6 Saturday నుండి July 14 Sunday ఉన్నవి. 

మొదటి పద్దతి

Day-1 Puja: Unmatta Varahi Puja ( ఉన్మత్త వారాహి పూజ)

Date: 6th July 2024, Saturday

Tithi: Ashada Sukla Padyami

Tithi Time: Jun 18, 10:07 am - Jun 19, 11:25 am

Day-2 Puja: Brihad Varahi Puja (బృహత్ వారాహి పూజ)

Date: 7th July 2024, Sunday

Tithi: Ashada Sukla Vidhiya

Tithi Time:  Jun 19, 11:25 am - Jun 20, 1:07 pm

Day-3 Puja: Swapna Varahi Puja (స్వప్నవారాహీ పూజ)

Date: 8th July 2024, Monday

Tithi: Ashada Sukla Tadiya

Tithi Time: Jun 20, 1:07 pm - Jun 21, 3:10 pm

Day-4 Puja: Kirata Varahi  Puja (కిరాతవారాహి పూజ)

Date: 9th July 2024, Tuesday

Tithi: Ashada Sukla Chavithi

Tithi Time: Jul 09, 6:09 am - Jul 10, 7:52 am

Day-5 Puja: Swetha Varahi Puja (శ్వేత వారాహి పూజ)

Date: 10th July 2024, Wednesday

Tithi: Ashada Sukla Panchami 

Tithi Time: Jun 22, 5:28 pm - Jun 23, 7:54 pm

Day-6 Puja: Dhoomra Varahi Puja (ధూమ్రవారాహి పూజ)

Date: 11th July 2024, Thursday

Tithi: Ashada Sukla Shashti

Tithi Time: Jun 23, 7:54 pm - Jun 24, 10:17 pm

Day-7 Puja: Maha Varahi Puja(మహావారాహి పూజ)

Date: 12th July 2024, Friday

Tithi: Ashada Sukla Sapthami

Tithi Time: Jun 24, 10:17 pm - Jun 26, 12:25 am

Day-8 Puja: Varthali Varahi  Puja (వార్తాలి వారాహి పూజ)

Date: 13th July 2024, Saturday

Tithi: Ashada Sukla Ashtami

Tithi Time: Jun 26, 12:25 am - Jun 27, 2:05 am

Day-9 Puja: Dandini Varahi Puja (దండిని వారాహి పూజ)

Date: 14th July 2024, Sunday

Tithi: Ashada Sukla Navami

TithiTime: Jun 27, 2:05 am - Jun 28, 3:05 am

Day-10: ఆది వారాహి మహపూజ మరియు ఉద్యాపన (Parana)

Date: 15th July 2024, Monday

Parana Time: After 05:56 AM

Tithi: Ashada Sukla Navami

TithiTime: Jun 28, 3:05 am - Jun 29, 3:19 am

రెందవ పద్దతి

Day-1 Puja: Indrani  Puja ( ఇంద్రాణి దేవి పూజ)

Date: 6th July 2024, Saturday

Tithi: Ashada Sukla Padyami

Tithi Time: Jun 18, 10:07 am - Jun 19, 11:25 am

Day-2 Puja: Brahmani Puja (బ్రహ్మి దేవి పూజ)

Date: 7th July 2024, Sunday

Tithi: Ashada Sukla Vidhiya

Tithi Time:  Jun 19, 11:25 am - Jun 20, 1:07 pm

Day-3 Puja: Vaishnavi Puja (వైష్ణవి దేవి పూజ)

Date: 8th July 2024, Monday

Tithi: Ashada Sukla Tadiya

Tithi Time: Jun 20, 1:07 pm - Jun 21, 3:10 pm

Day-4 Puja: Maheshvari  Puja (మహేశ్వరి దేవి పూజ)

Date: 9th July 2024, Tuesday

Tithi: Ashada Sukla Chavithi

Tithi Time: Jul 09, 6:09 am - Jul 10, 7:52 am

Day-5 Puja: Kaumari Puja (కౌమారి దేవి పూజ)

Date: 10th July 2024, Wednesday

Tithi: Ashada Sukla Panchami 

Tithi Time: Jun 22, 5:28 pm - Jun 23, 7:54 pm

Day-6 Puja: Chamunda Puja (కాళి చాముండా దేవి పూజ)

Date: 11th July 2024, Thursday

Tithi: Ashada Sukla Shashti

Tithi Time: Jun 23, 7:54 pm - Jun 24, 10:17 pm

Day-7 Puja: Shakambari Puja(శాకంబరి దేవి పూజ)

Date: 12th July 2024, Friday

Tithi: Ashada Sukla Sapthami

Tithi Time: Jun 24, 10:17 pm - Jun 26, 12:25 am

Day-8 Puja: Varahi  Puja ( వరాహి దేవి)

Date: 13th July 2024, Saturday

Tithi: Ashada Sukla Ashtami

Tithi Time: Jun 26, 12:25 am - Jun 27, 2:05 am

Day-9 Puja: Lalitha Parameswari Puja (లలిత పరమేశ్వరి పూజ)

Date: 14th July 2024, Sunday

Tithi: Ashada Sukla Navami

TithiTime: Jun 27, 2:05 am - Jun 28, 3:05 am

Day-10: ఉద్వాసన (Parana)

Date: 15th July 2024, Monday

Parana Time: After 05:56 AM

Tithi: Ashada Sukla Navami

TithiTime: Jun 28, 3:05 am - Jun 29, 3:19 am

పూజా విధానం

ఈ దేవికి నిత్య పూజాతో పాటు వారాహి అష్టోత్తరం, వారాహి షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలయినవరు వారాహి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము.. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. 

తప్పకుండా వారాహి షోడశ నామా స్తోత్రం పఠిచండి.

ఈ నవరాత్రి పూజల్లో భాగంగా  అష్టోత్రాలతో కుంకుమార్చన చేస్తారు మరియు సహస్రనామాలు, స్తోత్రాలు, దేవి భాగవతం, దుర్గ సప్తశతి మరియు దేవి మహత్యం లాంటివి పారాయణం చేయటం శుభాలను కలిగిస్తుందని భావిస్తారు.