Advertisment

సుబ్రహ్మణ్య షష్ఠి 2021 తేదీ మరియు పూజ విధానం

తారకాసుర సంహారం కోసం మార్గశిర శుద్ధ షష్టినాడు పుట్టినటువంటి కుమారస్వామి తారకాసుర సంహారం చేశాడు. ఈ మార్గశిర శుద్ధ షష్టినే కుమార షష్ఠి అంటారు, స్కంద షష్టి అంటారు సుబ్రమణ్య షష్టి అంటారు. 

సుబ్రహ్మణ్య షష్ఠి 2021 తేదీ

Subrahmanya Sashti 2021 Date and Tithi Time

Date Thursday December 9, 2021
Tithi Margashirsha Shukla Shashthi
Tithi Time Begins 09:26 PM, Dec 08 2021 - Ends 07:54 PM, Dec 09, 2021

సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత 

తారకాసుర సంహారం కోసం దేవతలు శివుడిని ప్రార్థించగా, శంకరుడు ఆయన వీర్యాన్ని తేజస్సు రూపంగా దేవతలకు ఇచ్చాడు. అది అగ్నిదేవుడు తీసుకొని వెళ్ళి ఆయన దానిని భరించలేక ఒక నీటి కొలనులో వదిలాడు. ఆ నీటి కొలనులో దర్బల మద్య కుమారస్వామి జన్మించాడు.అందువల్ల ఆయనకు  శరవణ భవణుడు అనే పేరొచ్చింది.
ఒకచేత్తో మహాశక్తి ఆయుధాన్ని మరోచేత్తో వజ్రాయుధం, ఒక చేత్తో అభయాన్ని ఇస్తూ,
మరో చేతిని కటి స్థానంలో పెట్టుకుని చాలా శక్తివంతంగా
ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణేశ్వరున్ని కనుక పూజిస్తే, మనకు నేత్ర రోగాలు తగ్గిపోతాయి. చలి జ్వరాలు తగ్గిపోతాయి, సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రాలు తెలియపరుస్తున్నాయి. అలా మార్గశిర శుద్ధ షష్టినాడు పుట్టినటువంటి కుమారస్వామి తారకాసుర సంహారం చేశాడు. తారకాసుర సంహారం తర్వాత దేవతలందరు హర్షధ్వానాలు చేశారు.  ఈ మార్గశిర శుద్ధ షష్టినే కుమార షష్ఠి అంటారు, స్కంద షష్టి అంటారు సుబ్రమణ్య షష్టి అంటారు. 

పూజ విధానం 

  • ఇలా శక్తి సంపన్నుడు అయినటువంటి ఈ కుమారస్వామికి  మనం భక్తి శ్రద్దలతో పూజలు చేస్తే, మన కోరికలు  అన్నీ కూడా సిద్ధిస్తాయి. మరియు ఈ స్వామికి కొన్ని ప్రాంతాలలో పాలు, పంచదార  కావడి రూపంతో తెచ్చి  సంతానం లేని వాళ్ళు మ్రొక్కుకొని సమర్పించి,
    ఎంతో మంది సంతానం పొందిన వారున్నారు. అలా శక్తి వంతుడు  అయినటువంటి ఈ సుబ్రహ్మణ్యుడికి మనం గనుక పూజ చేస్తే  సుబ్రమణ్యేశ్వరుడు కుజుడికి అధిపతి కనుక, కుజ దోషం  లేకుండా పోతుంది. ఈ సుబ్రమణ్యేశ్వరస్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం నువ్వులు బెల్లం కలిపి నటువంటి చిమ్మిరి అంటే చాలా
    ఇష్టం, వడపప్పు అంటే ఇష్టం, చలిపిండి అంటే ఇష్టం, అరటిపండు అంటే ఇష్టం, అన్నిటికంటే
    పొంగలి ఆయనకి ఎంతో ప్రీతికరమైనది. కనుక ప్రతి వాళ్లు కూడా, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాసం ఉండి, ముందుగా ఎక్కడైన పుట్ట ఉంటే, ఆ పుట్టలో కొంచెం పాలు పోసి అక్కడ కొంచెం చలిపిండి, వడపప్పు, నువ్వుల చిమ్మిరి, ఒక అరటిపండు పుట్ట దగ్గర పెట్టి రండి.  అలా కొంతమందికి పుట్ట లేకుండా ఉన్నప్పుడు, ఏదైనా దేవాలయాల్లో, కొన్ని పెద్ద పెద్ద పట్టణాలలో అక్కడ పుట్టలు ఉండవు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, దేవాలయాలకు వెళ్లి అక్కడ అలా ఈ జంట నాగుల గా ఉండే విగ్రహాలు ఉంటాయి. జంట నాగులుగా ఉండే  విగ్రహాల దగ్గరకు వెళ్ళి, శుభ్రంగా జంట నాగుల విగ్రహాలను వట్టి నీళ్ళతో కడగండి,  తర్వాత ఆవు పాలతోటి కడగండి. మళ్లీ వీలయితే పంచామృతలతో కూడా అభిషేకించండి. తరువాత శుబ్రంగా నీళ్ళతోటి కడిగి, ఆ వల్లి సుబ్రహ్మణ్యేశ్వరుడు కలిసి ఉంటారు గనుక, ఆ రెండు రూపాలకు 
    కూడా బాగా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, అలంకరణగా పుష్పాలు అన్నీ వేసి, తర్వాత ఎర్రటి పుష్పాలతో గనక పూజ లేదా అష్టోత్తర పూజ కనుక చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియపరుస్తున్నాయి. శుబ్రంగా అష్టోత్తర శతనామ పూజలు చేయించుకొని,  ఆ సుబ్రహ్మణ్యుడు దగ్గర అభిషేకం చేయించిన సందర్భంలో మనము చలివిడి, నువ్వులు చిమ్మిరి, పానకం, పొంగలి నివేదన చేసి స్వామివారికి హారతి ఇచ్చి, ఆ హారతులు కళ్లకద్దుకుని, తర్వాత స్వామివారికి నివేదన పెట్టిన ప్రసాదం తీసుకొని, సాయంకాలం గనుక మనం భోజనం చేస్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు బాగా
    అనుగ్రహం కలిగించి, సంతానం లేని వారికి సంతానం కలుగ చేస్తాడు, వివాహం
    ఆలస్యమయ్యే వారికి వివాహం త్వరగా జరిగేటట్టు చూస్తాడు. అనారోగ్యంగా ఉండేవారికి ఆరోగ్యంగా ఉండేలా  చేస్తాడు. నేత్ర బాదలు లేదా  వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య షష్ఠిని ఉపయోగించు, వల్లి సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి పూజ చేయించుకుని, ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని తెలియపరుస్తున్నాను. కనుక ప్రతి వాళ్లు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని  భక్తిశ్రద్ధలతో పూజించి, స్వామివారి అనుగ్రహం కలిగించుకుని, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తగిన ఫలితము
    పొందవలసిందిగా తెలియపరుస్తున్నాము.